గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న లీడింగ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయిన, ఇండియన్ బ్యాంక్, చెన్నై లో 2022 సంవత్సరానికి గానూ స్పోర్ట్స్ పర్సన్స్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా జారీ అయినది.
ముఖ్యాంశాలు :
1). ఇవి బ్యాంక్ ఉద్యోగాలు.
2). ఇంటర్ అర్హతలుతో భర్తీ.
3). స్పోర్ట్స్ కొటా లో నియామక ప్రక్రియ.
4). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే.
5). భారీ స్థాయిలో వేతనాలు.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో తెలిపారు.
తాజాగా వచ్చిన ఈ బ్యాంక్ పోస్టుల భర్తీ కు సంబంధించిన విషయాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
వివరణ | తేదీలు |
---|---|
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది | ఏప్రిల్ 30, 2022 |
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది | మే 14, 2022 |
ఉద్యోగాలు - వివరాలు :
క్లర్క్ / ఆఫీసర్స్ - 12
విభాగాల వారీగా ఖాళీలు :
పోస్ట్ లు | ఖాళీలు |
---|---|
అత్లేటిక్స్ (మహిళలు ) | 2 |
బాస్కెట్ బాల్ ( పురుషులు) | 2 |
క్రికెట్ ( పురుషులు ) | 2 |
హాకీ ( పురుషులు ) | 4 |
వాలీబాల్ ( పురుషులు ) | 2 |
మొత్తం పోస్టులు :
12 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన బోర్డు ల నుండి ఇంటర్ లేదా సమాన విద్యా అర్హతలును కలిగి ఉండి, సంబంధిత క్రీడ లో కంట్రీ తరుపున రిప్రెసెంట్ చేసిన, స్టేట్ తరుపున జూనియర్ / సీనియర్ నేషనల్స్ /నేషనల్ గేమ్స్ లో రిప్రెసెంట్ చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రకటనలో పొందుపరిచారు.
క్రికెట్ కేటగిరీ లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రంజీ లేదా దులీప్ ట్రోఫీ లలో దేశం తరుపున రిప్రెసెంట్ చేసి ఉండాలని ప్రకటనలో తెలిపారు.
వయసు :
18-26 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 400 రూపాయలు మరియు మిగిలిన ఎస్సీ /ఎస్టీ / దివ్యంగుల కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 100 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎలా ఎంపిక చేస్తారు:
అప్లికేషన్స్ స్క్రీనింగ్, స్పోర్ట్స్ పెర్ఫార్మన్స్ అండ్ అచీవ్ మెంట్స్, ట్రయిల్స్, ఇంటర్వ్యూ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
కేటగిరీలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 17,000 రూపాయలు నుండి 63,840 రూపాయలు వరకూ జీతం మరియు ఇతర మంచి బెనిఫిట్స్ లభించనున్నాయి.
0 Comments