భారతీయ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్, విశాఖపట్నం లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న నాన్ - టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు:
1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.
2). రెగ్యులర్ బేసిస్ మరియు కాంట్రాక్ట్ బేసిస్ లో పోస్టుల భర్తీ జరుగనుంది.
3). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకునే అవకాశం ఉంది.
4). భారీ స్థాయిలో వేతనాలు.
ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లుగా ప్రకటనలో తెలిపారు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకి వైజాగ్ లో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ఐఐఎం, విశాఖపట్నం నుండి వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన అతి ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది : మే 30, 2022 (4PM).
విభాగాల వారీగా ఖాళీలు :
పోస్ట్ లు | ఖాళీలు |
---|---|
సీనియర్ సూపరింటెండెంట్ (సీడీఎస్&అల్యూమ్ని) | 1 |
సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్ ) | 1 |
అసిస్టెంట్ (అడ్మినిస్ట్రేషన్&ప్రోగ్రామ్స్ ) | 1 |
అసిస్టెంట్ ( అకాడమిక్స్ & రీసెర్చ్ ) | 1 |
అసిస్టెంట్ ( అడ్మినిస్ట్రేషన్ & ప్రోగ్రామ్స్ ) | 1 |
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులను/డిప్లొమా లేదా డిగ్రీ ఇన్ మేనేజ్ మెంట్ కోర్సులను పూర్తి చేసిన వారు సీనియర్ సూపరింటెండెంట్ (సీడీఎస్&అల్యూమ్ని) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
బీఈ/బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్సులను కంప్లీట్ చేసినవారు సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.
55%మార్కులతో మార్కెటింగ్ మేనేజ్ మెంట్ విభాగంలో రెండు సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను పూర్తి చేసిన వారు అసిస్టెంట్ (అడ్మినిస్ట్రేషన్ & ప్రోగ్రామ్స్ ) ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
55%మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎంబీఏ/పీజీడీఎం లేదా గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ /టెక్నాలజీ కోర్సులను కంప్లీట్ చేసిన వారు అసిస్టెంట్ (అకాడమిక్స్ & రీసెర్చ్ ) మరియు అసిస్టెంట్ (అడ్మినిస్ట్రేషన్ & ప్రోగ్రామ్స్ ) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
విభాగాలను అనుసరించి 35 మరియు 40 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం వయసు పరిమితి సడలింపు అనగా ఏజ్ రిలాక్స్యేషన్ కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో వెబ్సైటు నుండి దరఖాస్తు ఫారం ను డౌన్లోడ్ చేసుకుని, సరైన వివరాలతో నింపిన అప్లికేషన్ ఫారంనకు సంబంధిత విద్యా ధ్రువీకరణ పత్రాలను జతపరచి, సంబంధిత అడ్రస్ కు నిర్ణిత గడువు చివరి తేదిలోగా పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులు లేవు.
ఎలా ఎంపిక చేస్తారు:
షార్ట్ లిస్ట్ / టెస్ట్ లు /పర్సనల్ ఇంటర్వ్యూల నిర్వహణ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ఆకర్షణీయమైన వేతనాలు లభించనున్నాయి. నెలకు సుమారుగా 30,000 నుండి 50,000 రూపాయలు వరకూ జీతం లభించనుంది.
దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్ ( చిరునామా ) :
The Senior Administrative Officer - HR,
Indian institute of management, Visakhapatnam,
Andhra Bank School Of Business Building,
Andhra University Campus,
Visakhapatnam - 530 003,
Andhra Pradesh.
0 Comments